కరోనా వ్యాక్సిన్ వేస్తున్న సమయంలో ఓ వృద్ధురాలు పూనకంతో ఊగిపోయిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వేమనపల్లి మండలంలోని ముల్కలపేటలో వ్యాక్సిన్ వేసుకుంటున్న సమయంలో 50 ఏళ్ల ఓ వృద్ధురాలు పెద్ద పెద్ద అరుపులతో పూనకం వచ్చినట్టు ఊగిపోయింది. అమ్మవారు పడితే ఏ విధంగా వ్యవహారిస్తారో ఆ రకంగా ఆమె ప్రవర్తించింది. అప్పటి వరకూ ప్రశాంతంగా టీకాల పంపణీ జరుగుతున్న ఆ గదిలో ఒక్కసారి ఆ వృద్ధురాలు ప్రవర్తించిన తీరుతో.. అంతా అవాక్కయ్యారు.
ఆరోగ్య కార్యకర్తలు ఏం చేయాలో అంతుపట్టని అయోమయానికి గురైయ్యారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. అక్కడి సిబ్బందిని ఆమె భయాందోళనలకు గురి చేసింది. అక్కడున్న వారు తీసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.