నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఆకాశం నుంచి వింత వస్తువులు పడ్డాయి. ఈ సంఘటన గుజరాత్ లో ఆనంద్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంతరిక్షం నుంచి ఎవో మిస్టీరియస్ మెటల్ బాల్స్ లాంటి వస్తువులు పడ్డాయని అన్నారు. ఆ సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయని ప్రజలు చెప్తున్నారు.
భూకంపం వస్తుందేమో అనే భయంతో గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆకాశం నుంచి పడిన ఆ వస్తువులు ఉపగ్రహా శకలాలుగా బావిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
వాటిని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరికి పంపినట్లు పోలీసులు తెలిపారు. వాటి వల్ల ఎలాంటి భయం అవసరం లేదని అధికారులు చెప్తున్నారు.