టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ సినిమా “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ మెగా మాస్ మల్టీస్టారర్ సినిమా.. నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే.. ఈ భారీ సినిమా తాలూకా పోస్ట్ థియేట్రికల్ హక్కులు ఏ స్ట్రీమింగ్ సంస్థ కొనుగోలు చేసిందో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమేజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.
ఇది వరకు దీనిపై భారీగా సాగిన రూమర్ కు ఎట్టకేలకు తెరపడింది. ఇక ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించగా పూజా హెగ్డే చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది.
Advertisements
అలాగే మణిశర్మ సంగీతం అందివ్వగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే.. మెగాస్టార్ చిరంజీవి.. ఆయన తనయుడు రామ్ చరణ్ ఒకే సారి తెరమీద కనిపించడంతో ప్రేక్షకుల్లో మంచి ఉత్సాహాన్ని అందిస్తోంది.