దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. కుక్కల దాడిలో మూడేళ్ళ పాప ప్రాణాలు కోల్పోయింది. ఢిల్లీ మోతీనగర్ లోని ఓ పార్కులో ఆడుకుంటున్న మూడేళ్ల పాపపై వీధి కుక్కలు అతికిరాతకంగా దాడి చేశాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన పాప అక్కడికక్కడే మృతి చెందింది.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. అయితే పాప తండ్రి ఘటన జరిగిన పార్క్ లోనే తోటమాలిగా పని చేస్తుంటాడు. ఘటన జరిగిన సమయంలో అతను అక్కడే పని చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.