భారీ భూకంపానికి మెక్సికో వాసులు బెంబేలెత్తిపోయారు. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.1గా నమోదైంది. పసిఫిక్ తీరంలోని అకాపుల్కో రిసార్టుకు 11 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపారు అధికారులు. దీని ధాటికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెక్సికో సిటీలో భవనాలు ఊగిపోయాయి.
ఒక్కసారిగా భూమి కంపించడంతో భవనాల్లోని ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అందులో భవనాలు ఊగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సుమారు నిమిషం పాటు భూమి కంపించిందని.. కొన్నిచోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు అధికారులు.