బీఆర్ఎస్ ఆవిర్బావ సభలో యూపీ మాజీ సీఎం, సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని ఆయన అన్నారు. దేశంలో విపక్ష నేతలను బీజేపీ వేధిస్తోందన్నారు.
మోడీ సర్కార్ చాలా మందని బతక నివ్వడం లేదన్నారు. అందుకే బీజేపీ వల్ల చాలా మంది దేశం విడిచి పోతున్నారంటూ ఆయన ఆరోపించారు. దేశంలో పెట్టుబడులు పెట్టే వారిపై బీజేపీ బెదరింపులకు దిగుతోందన్నారు. దేశంలో బీజేపీ పతనం ఖాయమైందని పేర్కొన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ జేబు సంస్థల్లాగా మారిపోయాయని ఆయన ఆరోపణలు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు 400 రోజులు మాత్రమే మిగిలి వుందని ప్రధాని మోడీ స్వయంగా చెప్పారని ఆయన పేర్కొన్నారు. దీంతో మోడీ సర్కార్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు.
ప్రస్తుతం బీజేపీ సర్కార్ రోజులు లెక్క పెట్టుకుంటోందన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడమే పనిగా బీజేపీ పెట్టుకుందన్నారు. జీ 20 సదస్సు అధ్యక్ష పదవిని కూడా బీజేపీ తన రాజకీయ ప్రచారాలకు వాడుకుంటోందన్నారు. దేశాన్ని బీజేపీ వెనక్కి తీసుకెళ్తోందన్నారు.