తల వెంట్రుకలు ఊడిపోతున్నాయని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ మాదాపూర్ లో చోటు చేసుకుంది. మాదాపూర్ కు చెందిన బాధిత కుర్రాడు ఇంటర్ చదువు ముగించుకుని జెఈఈ పరీక్షలకు సిద్ధం అవుతున్నాడు. గత కొన్ని నెలలుగా ఆ యువకుడు జుట్టు రాలిపోతుండటంతో అదే విషయాన్ని తల్లితండ్రులకు చెప్పుకుని ఆవేదన చెందేవాడు.
రోజులాగే సోమవారం స్నానానికి వెళ్లిన యువకుడు ఎప్పటికి రాకపోయేసరికి అనుమానంతో తలుపు తట్టింది యువకుని తల్లి. ఎంత సేపయినా ఆ కుర్రాడు స్పందించకపోవటంతో… భర్త కు ఫోన్ చేసి చెప్పింది. భర్త చేరుకొని తలుపులు పగలగొట్టి చూసే సరికి ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు యువకుడు. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జుట్టు రాలిపోతుందనే కారణంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు చెప్పటంతో కేసు నమోదు చేసుకున్నారు.