హైదరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. 14వ అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. శేరిలింగంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండ్రి మందలించాడని 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
సరిగా చదవటం లేదని.. అల్లరి ఎక్కువ అవుతోందని మందలించడంతో అద్వైత్ అనే విద్యార్థి అపర్ణ సరోవర్ భవనం 14వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లేకలేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు ఇలా ఆత్మహత్యకు పాల్పడటంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటనపై స్పందిస్తూ పిల్లలు చాలా సున్నితంగా ఉంటున్నారని నిపుణులు అంటున్నారు. చిన్న విషయాలకు త్వరగా దిగులు చెందుతున్నారని చెబుతున్నారు. పిల్లలకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించాలని చెబుతున్నారు. ఈ విషయంలో విద్యావ్యవస్థలో సుమూలమైన మార్పులు రావాలని అంటున్నారు. స్కూల్ సిలబస్ లో భాగంగా వ్యక్తిత్వ వికాసంపై సబ్జెక్ ఉండాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.