సినీతారులకు సామాన్య ప్రజల్లో చాలా క్రేజ్ ఉంటుంది. జనం నుంచి వచ్చే అభిమానం తోబాటూ ఇబ్బందులు కూడా ఉంటాయి. వారిని చూడడానికి వచ్చి అమాంత మీద పడుతుంటారు. దైవ దర్శనం, సినిమా ప్రమోషన్స్ , షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ ఇలా ఎక్కడకు వెళ్ళినా పెద్ద ఎత్తున వచ్చి వారిని ఇబ్బంది పెడుతుంటారు. తాజాగా అలాంటి ఇబ్బందికర పరిస్థితి ‘ఆకాశమే నీ హద్దురా’ మూవీ హీరోయిన్ అపర్ణ బాలమురళికి ఎదురైంది.
ఓ స్టూడెంట్ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ‘తాకం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్ ఓ కాలేజీలో వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఓ స్టూడెంట్ అత్యుత్సాహంతో అపర్ణ బాలమురళి భుజంపై చెయ్యి వెయ్యాడానికి చూసాడు.
మొదట అపర్ణకు ఫ్లవర్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆ స్టూడెంట్ తర్వాత ఆమె భుజంపై చేయివేశాడు. అతడి ప్రవర్తనతో అపర్ణ ఇబ్బందిగా ఫీల్ అయ్యింది. ఆ స్టూడెంట్ నుంచి తప్పిచుకోడానికి ట్రై చేసింది.
అయితే, ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ మారింది. ఆ సమయంలో చిత్ర యూనిట్ తో పాట కాలేజీ మేనేజ్ మెంట్ అక్కడే ఉన్నా సరే, ఆ స్టూడెం చేస్తోన్న పనిని అడ్డుకోక పోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసారు. “ఆకాశమే నీ హద్దురా” సినిమాలో ఆమె నటనకు గానూ జాతీయ అవార్డు గెలుచుకోవడం తెలిసిందే.
మళయాళంలో బిజీహీరోయిన్ గా కొనసాగుతోంది అపర్ణ బాలమురళి. ప్రస్తుతం ఫహాద్ ఫాజిల్ తో హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ధూమంలో నటిస్తోంది. ఈ చిత్రంతో పాటు మరో ఆరు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.