నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో ధారుణం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని బిసి వసతి గృహంలో ఉంటూ బాలుర పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న శివప్రసాద్ అనే విద్యార్థి సైనిక్ పాఠశాల ప్రవేశ పరీక్ష రాసేందుకు తన పిన తల్లి నిరాకరించడంతో నిరాశకు లోనయ్యాడు. మంగళవారం రాత్రి ఎలకల మందును తాగాడు. మందును త్రాగడాన్ని తోటి విద్యార్ధులు గమనించి హుటాహుటిన స్థానికుల సహాయంతో నవీపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ విద్యార్థికి ప్రథమ చికత్స అందించిన వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ సహాయంతో జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు.విద్యార్థి శివ ప్రసాద్ ది నిర్మల్ జిల్లా లింబాకే గ్రామంకు చెందిన వాడిగా సమాచారం.