ఢిల్లీ రైతు ఉద్యమ తరహాలో నిరుద్యోగులు ఉద్యమానికి సిద్ధం కావాలని విద్యార్థి నిరుద్యోగ ఫ్రంట్ ఓయూ చైర్మన్ చనగాని దయాకర్ పిలుపునిచ్చారు. ఓయూలో జరిగిన నిరుద్యోగ నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… రానున్న నూతన సంవత్సరంలోనైనా నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగుల బతుకుకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతీ ఉప ఎన్నిక సమయంలోనూ కొత్త ఉద్యోగాల ప్రకటన విడుదల చేస్తామని చెప్తూ.. కేసీఆర్ గారడి మాటలతో మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
అటు రైతులను, ఇటు నిరుద్యోగులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని దయాకర్ మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ఆకలి చావులు తప్ప.. ఉద్యోగాలు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు మరో పోరాటానికి సిద్ధమవ్వాలని సూచించారు. నోటిఫికేషన్ విడుదల చేయని పక్షంలో ఢిల్లీ రైతుల ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు దయాకర్.