ఉస్మానియా యూనివర్సిటీ భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందా?
వేల ఎకరాల భూములను చడీ చప్పుడు కాకుండా చదును చేస్తున్నారా?
ఉస్మానియా యూనివర్సిటీ కి చెందిన 4 ఎకరాల భూమి పై తార్నాక కార్పొరేటర్ అలకుంట సరస్వతి భర్త అలకుంట హరి కన్ను పడింది. మనికేశ్వరి నగర్ కు ఆనుకొని ఉన్న 200 కోట్ల నాలుగు ఎకరాల భూమి నాదే అంటూ అందులో కొంత భూమిని చదును చేశారు. ఇది గమనించిన విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి.
ఇది కేవలం కార్పొరేటర్ చేస్తున్న పని కాదని, దీని వెనుక ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నారని మండిపడుతున్నారు.తొలి వెలుగు గ్రౌండ్ రిపోర్ట్ లో విద్యార్థి నాయకులు మాట్లాడారు. ఏం మాట్లాడారో కింది వీడియోలో చూడొచ్చు.