రాజధాని రగడ ఉద్రిక్తంగా మారుతోంది. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్ధులు రోడ్డెక్కారు. ధర్నా చేశారు. పోలీసులు కల్పించుకోవడంతో ఆందోళన కాస్తా రచ్చరచ్చయ్యింది.
కర్నూలు: రాయలసీమలో రాజధాని, హైకోర్టును ఏర్పాటు చేయాలని విద్యార్థులు నిర్వహించిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. కర్నూలు జిల్లా నంద్యాలలో మంత్రుల సమీక్షా సమావేశం భవనం ఎదుట విద్యార్థులు ధర్నాకు పూనుకున్నారు. రాయలసీమలో రాజధాని, హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు, విద్యార్థి నేతల మధ్య తీవ్ర వాగ్వాదాలు చెలరేగాయి. అది కాస్తా తోపులాటకు దారితీసింది.