కేంద్రం తాజాగా తీసుకు వచ్చిన అగ్నిపథ్ పథకంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేండ్ల తర్వాత సర్వీసు నుంచి తమను ఇంటికి పంపితే తమ భవిష్యత్ ఏమవుతుందని యువత ఆందోళన చెందుతోంది.
ఈ క్రమంలో అగ్నిపథ్ పై ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. పలు చోట్ల ప్రభుత్వ, ప్రజా ఆస్తులను నిరసనకారులు ధ్వంసం చేశారు. ముఖ్యంగా బిహార్, యూపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో ఆర్మీ ఉద్యోగార్థులు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు బిహార్ లోని ప్రతిపక్ష ఆర్జేడీ సహా పలు పార్టీలు మద్దతును తెలిపాయి. మిగతా రాష్ట్రాల్లోనూ అక్కడక్కడ కొన్ని పార్టీలు వారికి మద్దతుగా నిలుస్తున్నాయి.
మరోవైపు అగ్నిపథ్ స్కీంపై అన్ని పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. స్కీంపై విస్తృత చర్చలు జరపకుండానే హడావుడిగా దీన్ని తీసుకువచ్చిందని మండిపడుతున్నాయి. ఈ మేరకు అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.