ఫ్లయింగ్ స్క్వాడ్ లపై విద్యార్థులు దాడికి దిగారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని ఓ డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్ రెచ్చిపోయారు. కారు అద్దాలు ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. పరీక్షలో మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్న పది మంది విద్యార్థులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
అంతటితో ఆగకుండా వారిని డిబార్ చేశారు. డిబార్ చేసిన వారిలో నలుగురు మహిళా విద్యార్థినులు కూడా ఉన్నారు. ఇంకోసారి ఇలా చేయమని.. డిబార్ చేయొద్దని అధికారులు వేడుకున్నా అయినా వారు వినిపించుకోలేదు.
దీంతో ఫ్లయింగ్ స్క్వాడ్స్ తో వాగ్వాదానికి దిగారు. ఇక ఆగ్రహానికి గురైన విద్యార్థులు.. అక్కడి నుంచి వెళ్లిపోతున్న అధికారుల కార్లపై రాళ్లదాడికి దిగారు.
విద్యార్థుల రాళ్లదాడిలో అధికారులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.