కర్ణాటకలో ఓ ఉపాధ్యాయుడికి తరగతి గదిలోనే అవమానకరమైన ఘటన చోటుచేసుకుంది. దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకాలోని ఓ హైస్కూల్ లో ఆకతాయి విద్యార్థులు.. ఉపాధ్యాయుడిపై దాడి చేశారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఈ దాడి తరగతి గదిలోనే జరగడం మరింత దారుణం.
క్లాస్ రూంలోకి వచ్చిన టీచర్… అక్కడ గుట్కా పాకెట్ కనిపించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ హిందీ టీచర్ పై అసభ్యకరంగా ప్రవర్తించి.. డెస్ట్ బిన్ తో దాడి చేసేందుకు ప్రయత్నించారు. తరువాత దాన్ని టీచర్ తలపై పెట్టారు. అయితే, ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటనపై విద్యాశాఖ.. పోలీస్ విచారణ చేపట్టాలని ఆదేశించింది. అటు, విద్యాశాఖ మంత్రి బిసి నగేష్ కూడా ఈ అంశంపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ అంశంపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.