ఈ ప్రిన్సిపాల్ మాకు వద్దు అంటూ కాటారం మండల కేంద్రంలో ప్రధాన కూడలి వద్ద గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. వివరాల ప్రకారం ..గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ చైతన్య తమను రోజూ ఏదోక కారణం చెప్పి వేధిస్తుందని విద్యార్థినులు పేర్కొన్నారు.
పాఠశాలలో ఉన్న సమస్యలను పట్టించుకోకుండా తమ పై అధికారం చెలాయిస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. పాఠశాల నుండి ప్రిన్సిపాల్ ను బదిలీ చేయాలంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థినులకు నచ్చచెప్పి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థినిలు నిరసన విరమించారు.