విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ ఒకరి మృతికి కారణమైంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిందీ దారుణం. లక్నేపల్లి శివారులోని బిట్స్ కాలేజ్ లో విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. ఈ క్రమంలో సంజయ్ అనే విద్యార్థిని మరో విద్యార్థి భవనంపై నుంచి తోసేశాడు.
బిల్డింగ్ పైనుంచి పడడంతో సంజయ్ కి తీవ్ర గాయాలయ్యాయి. కాసేపటికే చనిపోయాడు. మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పోలీసులు కాలేజ్ లో విచారణ చేపట్టి గొడవకు గల కారణాలను తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.