ఇటీవల సోషల్ మీడియా ఛాలెంజ్ లు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. కొన్ని ఛాలెంజ్ లు పర్యావరణానికి అనుకూలంగా ఉంటూ మంచి చేసేవిగా ఉంటే.. కొన్ని మాత్రం ప్రాణాలు హరించేలా ఉంటున్నాయి. గత కొన్నాళ్లుగా చిప్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ బంగాళదుంప చిప్స్ లో ఒక చిప్ ఘాటుగా ఉంటుంది. దీన్ని తినడం గురించే ఈ చిప్ ఛాలెంజ్. అయితే.. ఈ ఛాలెంజ్ లో పాల్గొని ముగ్గురు స్కూల్ విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది.
శాక్రమెంటో సమీపంలోని లోడి హైస్కూల్‌కు చెందిన కొంతమంది విద్యార్థులు బంగాళాదుంప చిప్ తిన్న తర్వాత ఆసుపత్రి పాలయ్యారని స్కూల్ ప్రిన్సిపాల్ ఆడమ్ ఔర్‌బాచ్ తెలిపారు. ఈ ఛాలెంజ్ పాల్గొన్నవారికి ఊపిరి ఆడక శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది తలెత్తిందని చెప్పారు. వీటిని తిన్న తరువాత తాను కూడా వాంతులు చేసుకున్నా అని ప్రిన్సిపాల్ అన్నారు.
ఈ ఛాలెంజ్‌ని Paqui బ్రాండ్ రూపొందించింది. ఇది తక్కవ సమయంలో బాగా పాపులర్ అయింది. #onechipchallenge అనే హ్యాష్‌ట్యాగ్‌తో టిక్ టాక్ లో ఇప్పటి వరకు 475.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. చిప్‌లో కరోలినా రీపర్, స్కార్పియన్ పెప్పర్స్ ఉన్నాయి. భూమి మీద దొరికే అత్యంత వేడి వస్తువు అయిన మిరియాలతో ఈ పెప్పర్స్ తయారు చేస్తారు. దీంతో ఈ చిప్స్ చాలా స్పైసీగా ఉంటాయి. తినడం కూడా చాలా కష్టం.
Advertisements
ఇలాంటి చిప్స్ తీసుకొని వస్తున్న విద్యార్థులను తిరిగి ఇంటికి పంపించేస్తున్నామని స్కూల్ యాజమాన్యం చెప్పింది. ఈ చిప్స్ తిన్న విద్యార్థులు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.