తరగతి గదుల్లో ఉపాధ్యాయులను విద్యార్థులు ఆటపట్టించే సన్నివేశాలను మనం సహజంగా సినిమాల్లోనే చేస్తుంటాం. బయటి ప్రపంచంలో నిజానికి అలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఉపాధ్యాయులను ఆటపట్టించేంత ధైర్యం ఏ విద్యార్థీ చేయడు. కానీ ఆన్‌లైన్ తరగతుల పుణ్యమా అని అదే ఇప్పుడు నిజమవుతోంది. కొందరు విద్యార్థులు ఓ ఉపాధ్యాయున్ని దారుణంగా ఆటపట్టించారు. అందుకు ఆ ఉపాధ్యాయుడి రియాక్షన్ ను మాటల్లో చెప్పలేం. ఆ వీడియో చూడాల్సిందే.
ఆన్‌లైన్ క్లాసుల నేపథ్యంలో ఓ ఉపాధ్యాయులు విద్యార్థులకు తరగతి నిర్వహిస్తుండగా.. కొందరు ఆయనను ఆట పట్టించారు. ఒక విద్యార్థి kya aapke toothpaste pe namak hai (మీ టూత్‌పేస్టులో ఉప్పు ఉందా) అని అడగ్గా.. అందుకు ఆ ఉపాధ్యాయుడు ఫైరయ్యాడు. ఇక ఆన్‌లైన్ క్లాసులో కొందరు విద్యార్థులు ఆయనను ఆట పట్టించారు. దీంతో విసుగు చెందిన ఆ ఉపాధ్యాయుడు దెబ్బకు లైవ్ నుంచి తప్పుకున్నాడు.
ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులు ఫన్నీగా చేసిన ఆ వీడియోను చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు. కానీ నిజానికి ఆ ఉపాధ్యాయుడికి ఎదురైన అనుభవం నిజంగా ఎవరికీ ఎదురు కాకూడదు. వారు కావాలనే అలా చేశారో, నిజంగా ఆ సంఘటన జరిగిందో కూడా ఎవరికీ తెలియదు..!
Watch Video :