దుమాల ఈఎంఆర్ఎస్(ట్రైబల్) హస్టల్ లో సరైన వసతులు లేవని ఆదివారం సిరిసిల్ల-కామారెడ్డి హైవేపై విద్యార్థులు బైఠాయించి ఆందోళన తెలిపారు. అన్నంలో పురుగులు, వానపాములు వస్తున్నాయని తినలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల నిరసనకు స్వేరోస్ నెట్వర్క్ జిల్లా కో ఆర్డినేటర్ మారుపాక రాజు మద్దతు తెలిపారు. బస్టాండ్ నుండి హాస్టల్ వరకు విద్యార్థులతో కలిసి కాలి నడకన వెళ్లారు.
ఈ సందర్భంగా కో ఆర్డినేటర్ మారుపాక రాజు మాట్లాడుతూ.. సమస్య తీరే వరకు రోడ్డపై బైఠాయిస్తామన్నారు. విద్యార్థుల బాగోగుల కోసం ఎంతవరకైనా వెళ్తామన్నారు. ప్రిన్సిపాల్, వార్డెన్ రమ్య , అటెండర్ రామస్వామి వర్కర్ భద్రమ్మలు విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ఆర్ సీకి కంప్లైంట్ ఇచ్చిన అదే తీరు ఉందన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతా మన్నారు మారుపాక రాజు.
అనంతరం విద్యార్థుల నిరసనపై విమెన్ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి కులేరి మౌనిక స్పందించారు. విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆహారం, వసతులు బాగున్నాయి అని గుర్తు చేశారు. సెక్రటరీ, అధికారుల పర్యవేక్షణలో ప్రతి హస్టల్ ఉండాలని కోరారు.
ప్రతి హస్టల్స్ క్షుణ్ణంగా ఆకస్మికంగా తనిఖీ చేస్తామని వెల్లడించారు మౌనిక. కాగా ఆర్సీవో హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సందీప్ స్వేరో , శ్రీనివాస్ స్వేరో, రాజు స్వేరో, నిలేష్ స్వేరో, ప్రవీణ్ స్వేరో, బాలాజీ స్వేరో, తదితరులు పాల్గొన్నారు.