కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి సంఘాలన్నీ ఒకేసారి నిరసనకు దిగాయి. పరిపాలన భవనం ముందు బైఠాయించి వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విద్యార్థులు.
సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు చదువుతున్న స్టూడెంట్స్ ని హాస్టల్ ఖాళీ చేయాలంటూ తాజాగా వీసీ ఆదేశాలు జారీ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ భవనం పైకెక్కి నిరసన తెలిపారు విద్యార్థులు. వర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సడెన్ గా హాస్టల్ ఖాళీ చేయాలంటే ఎక్కడికి పోవాలని పరిపాలన భవనం ముందు ఆందోళనకు దిగారు విద్యార్థులు. తమను వలస కార్మికులకంటే అధ్వానంగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీ వాంట్ జస్టిస్ నినాదాలతో వర్సిటీ ప్రాంగణం మార్మోగింది.
వీసీ తన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు విద్యార్థులు. అయితే.. పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.