వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మేడిపల్లి కలాన్ గ్రామంలో వింత పరిస్థితి నెలకొంది.ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ ఖాజా మొయినుద్దీన్ సాధారణ బదిలీ లో ఎక్కడికి వెళ్ళొద్దంటూ పాఠశాల విద్యార్థులు స్కూల్ ముందు ధర్నా చేపట్టారు.
మా సార్ మా స్కూల్లో నే ఉండాలంటూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు 129 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ఖాజా మొయినుద్దీన్ 12 ఏళ్ళుగా విధులు నిర్వహిస్తున్నారు.
గ్రామం నుండి ఒక్క విద్యార్థి కూడా ప్రైవేటు పాఠశాలకు వెళ్ళకుండా,డ్రాప్ ఔట్స్ లేకుండా కృషి చేసి ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దాడు. 8 ఏళ్ళు ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారు ఖచ్చితంగా బదిలీ కావాలన్న నిబంధన వల్ల తప్పనిసరి పరిస్థితిలో హెడ్ మాస్టర్ బదిలీ కావలసిన పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో హెడ్ మాస్టర్ బదిలీ కావొద్దంటూ….మా సార్ మాకే కావాలంటూ విద్యార్థులు నిరసన తెలిపారు. పొవొద్దు…పొవొద్దు అంటూ ఫ్లకార్డులు పట్టుకొని పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు.