బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. విద్యార్థులకు సెలవులు ప్రకటించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించమంటే సెలవు ఇచ్చారంటూ ఫైర్ అవుతున్నారు.
ఇటీవల జరిగిన చర్చల్లో విద్యార్థుల డిమాండ్ల పరిష్కారానికి రేపటితో గడువు ముగియనుండగా, మరో 48 గంటలే ఉందంటూ విద్యార్థులు శుక్రవారం ట్వీట్ చేశారు. అయితే విద్యార్థులు ఇలా ట్వీట్ చేసిన గంటకే సెలవులు ప్రకటన ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమస్యలు పరిష్కరించమంటే సెలవులు ఇచ్చారని, సెలవులు ఇస్తే ఎవరికి వారు ఇంటి దారి పడుతారని అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలు పరిష్కరిస్తామని సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క సమస్య కూడా పరిష్కరం కాలేదని విద్యార్ధులు తెలుపుతున్నారు.రెండు రోజుల క్రితం కూడా విద్యార్థులు తిన్న ఆహారం కలుషితం అవ్వడం పెద్ద చర్చానీయాంశమైంది.