పౌరసత్వ చట్టం బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయటం మాత్రమే కాదు… బీజేపీ అంటే గిట్టని సంఘాలను కూడా కలుపుతున్నాయి. కొంతకాలంగా బీజేపీకి వ్యతిరేకంగా జట్టుకడుతున్న రాజకీయ పక్షాలకు తోడు… ఇప్పుడు బీజేపీ అనుబంధ సంఘాలు కూడా ఏకం అవుతున్నట్లు కనపడుతున్నాయి.
ఇప్పటికే క్యాబ్, ఎన్‌ఆర్‌సీ, సీఎఎలపై దేశవ్యాప్త ఆందోళనలు సాగుతున్నాయి. యూనివర్శిటీలన్నీ ఉద్యమ శక్తులకు కేంద్ర బిందువులుగా మారిన సందర్భంలో… ఓయూ చెగువెరాగా గుర్తింపు పొందిన స్టూడెంట్ లీడర్ జార్జిరెడ్డిని గుర్తు చేసుకుంటూ… ప్రభుత్వ వ్యతిరేక విద్యార్థులు పాటను పాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉస్మానియాలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో… బీజేపీ అనుబంధ సంఘం ఏబీవీపీ విద్యార్థుల చేతుల్లో హత్య చేయబడ్డ జార్జిరెడ్డి పాటను పాడటం, విద్యార్థులంతా గొంతు కలపటం గమనార్హం.