తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హబ్సిగూడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేసి కేసీఆర్ చిత్ర పటాన్ని దగ్ధం చేశారు విద్యార్తి , యువజన సంఘాల నాయకులు.
అయితే విషయం తెలియటంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.దీనితో కాసేపు తోపులాట జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కేసీఆర్ మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కేసీఆర్ ను అంతు చూస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షులు బాబుమహాజన్ ,యువజన సమితి రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సలీం పాషా , విద్యార్థి జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసంపల్లి అరుణ్ కుమార్ లు పాల్గొన్నారు.
వీరితో పాటు యువజన సమితి రాష్ట్ర కో.ఆర్డినేటర్ ఎర్ర వీరన్న , హైదరాబాద్ అధ్యక్షులు సుశీల్ కుమార్,మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రాజు , విద్యార్థి జన సమితి రాష్ట్ర నాయకులు బాలెంల జీవన్ ,మేకల పవన్ తదితరులు పాల్గొన్నారు.