మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం అలా వైకుంఠపురంలో. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు మంచి కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ సినిమా ఇంతటి విజయం సాధించ డానికి ముఖ్య కారణం తమన్. కాగా తమన్ పుట్టిన రోజు నేడు. ఈ సంద్భంగా పలువురు సినీ తారలు విశేషాలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో నే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. బ్రదర్ తమన్.. ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి. గత సంవత్సరం లాగానే ప్రతి సంవత్సరం మరపురానిదిగా నిలిచిపోవాలి. నీ సంగీతంతో కొన్ని లక్షల మందిని అలరించాలని కోరుకుంటున్నా అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. తమన్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు.
Many Happy Returns of the day to my Brother @MusicThaman . May every year be as prosperous as the last year. May to continue to spread joy to millions through your music 🎶 pic.twitter.com/r5r8mxJ8aL
— Allu Arjun (@alluarjun) November 16, 2020