తమిళనాడులో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల కస్టడీ డెత్ కేసులో ఎస్ ఐ మృతి చెందారు. ఈ కేసులో అరెస్టైన స్పెషల్ సబ్ ఇన్స్‌పెక్టర్ పాల్‌దురై కరోనాతో మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చికిత్స అందిస్తుండగా, సోమవారం ఉదయం పరిస్థితి విషమించడంతో ఎస్ ఐ పాల్‌దురై మరణించారు. చికిత్ అందించనందు వల్లే ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తాన్‌కులానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్, బెనిక్స్ లను పోలీసులు అరెస్టు చేసి, చిత్రహింసలు పెట్టడంతో వారంతా మరణించారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తటంతో దీనిపై సీబీఐ దర్యాప్తుకు తమిళ సర్కార్ అనుమతిచ్చింది. ఈ విచారణలో కస్టడీ డెత్ లో ప్రమేయం ఉన్న దాదాపు 10మంది పోలీసులను సీబీఐ అరెస్ట్ చేసి, కేసులు నమోదు చేసింది. వీరిలో కరోనాతో మరణించిన ఎస్ ఐ పాల్ దురై కూడా ఉన్నారు.