సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ తల్లి ఎస్ఎస్ కాంతం మృతి చెందారు. చెన్నై లో నివాసం ఉంటున్న కాంతం వయసు 88 సంవత్సరాలు. రెండేళ్లక్రితం శుభలేఖ సుధాకర్ తండ్రి కృష్ణా రావు మృతి చెందారు. ఇటీవల సుధాకర్ తల్లి గుండెపోటుకు గురయ్యారు.దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది.
వీటితో పాటు వృద్దాప్య సమస్యలతో పాటు వయసు సమస్యలు కూడా తోడవడంతో ఆమె మంగళవారం కన్నుమూసారు. కృష్ణారావు, కాంతం దంపతులకు ముగ్గురు కుమారులు కాగా సుధాకర్ పెద్ద కొడుకు. ఈ రోజు మధ్యాహ్నం చెన్నైలో ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి.