భారతదేశాన్ని బందీలుగా ఉంచే శక్తి ఈ భూమ్మీద లేదు. నాకు రక్తం ఇవ్వండి. నేను మీకు స్వేచ్ఛనిస్తాను అంటూ.. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఎంతగానో పోరాడటమే కాకుండా.. భావి తరాల హృదయాలలో దేశభక్తిని పెంపొందించిన మహోన్నత యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్.తెల్లదొరల పాలన అంతం కావడానికి ఒక్క అహింసా మార్గం సరిపోదని.. సాయుధ పోరాటం బాట పట్టిన గొప్ప స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రభోస్. భావి తరాలకు ఈయనే ఆదర్శం.
నేతాజీ సుభాష్ చంద్రభోస్ గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. ఈయన జాతీయవాద భావాలు బ్రిటీష్ వలస పాలన నుంచి భారతదేశానికి సాతంత్య్రం రావడానికి ఎంతగానో సహాయపడ్డాయి. అలాగే యువ తరాల యువ తరాల హృదయాలలో దేశభక్తిని పెంపొందించాయి. స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరైన సుభాష్ చంద్రబోస్ జయంతిని ప్రతిఏడాది జనవరి 23న జరుపుకుంటాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్ లో జన్మించారు.
ఈ ఏడాది జరుపుకుంటున్న సుభాష్ చంద్రబోస్ జయంతి 126వది. బెర్లిన్ లోని స్పెషల్ బ్యూరో ఆఫ్ ఇండియాకు చెందిన జర్మన్, భారత అధికారులు సుభాష్ చంద్రబోస్ కు ‘నేతాజీ’ అనే బిరుదును ఇచ్చారు. ఆజాద్ హింద్ ఫౌజ్ అని కూడా పిలువబడే భారత జాతీయ సైన్యానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వం వహించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రభోస్ జయంతి సందర్భంగా ఈ చెప్పిన కొన్ని గొప్ప సూక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక వ్యక్తి ఒక ఆలోచన కోసం చనిపోవచ్చు, కానీ ఆ ఆలోచన.. అతని మరణం తర్వాత అంటే వెయ్యి జన్మల వరకు కూడా బతికే ఉంటుంది. భారతదేశ భవితవ్యంపై మీ నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. భారతదేశాన్ని బందీలుగా ఉంచే శక్తి భూమ్మీద లేదు. తొందరలోనే భారత్ కు స్వాతంత్ర్యం వస్తుంది.రక్తం మాత్రమే స్వేచ్ఛకు మూల్యం చెల్లించగలదు.
నాకు రక్తం ఇవ్వండి.. నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను. మన స్వేచ్ఛకు మన రక్తంతో మూల్యం చెల్లించడం మన కర్తవ్యం.అపరిమితమైన జాతీయవాదం, పరిపూర్ణ న్యాయం, నిష్పాక్షికత ఆధారంగానే భారత విమోచన సైన్యాన్ని నిర్మించగలం. అన్యాయాన్ని సరిదిద్దుకోవడమే అతి పెద్ద నేరం అని మరచిపోవద్దు. శాశ్వత ధర్మశాస్త్రాన్ని గుర్తుంచుకోండి.. మీరు పొందాలనుకుంటే మీరు ఇవ్వాలి.
తమ జాతికి ఎల్లప్పుడూ విధేయులుగా ఉండే సైనికులు, తమ ప్రాణాలను త్యాగం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే సైనికులు అజేయులు.
పోరాటం లేకపోతే – రిస్క్ తీసుకోకపోతే జీవితం దాని ఆస్తిని సగం కోల్పోతుంది.వాస్తవం అనేది మన బలహీనమైన అవగాహనకు పూర్తిగా అర్థం చేసుకోలేనంత పెద్దది. ఏదేమైనా సత్యాన్ని కలిగి ఉన్న సిద్ధాంతంపై మన జీవితాన్ని నిర్మించుకోవాలి.”స్వేచ్ఛ ఇవ్వబడదు, తీసుకోబడుతుంది.”చర్చల ద్వారా చరిత్రలో నిజమైన మార్పు ఏదీ సాధించలేదు.