హెలికాప్టర్ ప్రమాదంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో ఈ అంశం పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోతే దేశ భద్రతకు ముప్పుగా మారుతుందని అన్నారు.
ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి రిపోర్ట్ రాకుండా మాట్లాడటం కష్టమని.. అయితే, తమిళనాడు లాంటి సేఫ్ జోన్‌లో మిలటరీ హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడాన్ని సాధారణంగా తీసుకోకూడదని సుబ్రమణ్య స్వామి అన్నారు.
కాగా, తమిళనాడు ప్రాంతంలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మొత్తం 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ మొదలైందని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ లో తెలిపారు.