సుచరిత, ఏపీ హోంమంత్రి
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. శ్రీకాంత్ అనే కార్యకర్తను ఇంట్లోకి తీసుకెళ్లి తీవ్రంగా గాయపరిచారు. ఇంకో కార్యకర్తకు కన్ను పోయేంత పని చేశారు. ఈ ఘర్షణల్లో టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారని అంటున్నారు. అదే నిజమైతే వారిని మీడియాలో ఎందుకు చూపించడంలేదు. రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీ ఉద్రిక్త వాతావరణం సృష్టించింది.
కొప్పర్రు విషయంలో చంద్రబాబు వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారు. నిజాలు తెలియజేసేందుకే అక్కడకు వెళ్లా. టీడీపీ కార్యకర్తలు పక్కా ప్లాన్ తో ఘర్షణకు దారితీసేలా చేశారు. వీడియోలు చూస్తే ఎవరేం చేశారో స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ శ్రేణులకు అన్నిరకాలుగా అండగా ఉంటాం.