కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలు చేసేవాళ్లు కొందరున్నారు. రెమ్యూనరేషన్ గట్టిగా ఇస్తే మల్టీస్టారర్లలో నటించే హీరోలు కూడా ఉన్నారు. అయితే సుదీప్ మాత్రం ఈ రెండు కేటగిరీలకు చెందని హీరో. తను డబ్బుల కోసం మల్టీస్టారర్ మూవీస్ చేయనంటున్నాడు.
“డబ్బుల కోసం నేను మల్టీస్టారర్ చేయను. కేవలం రిలేషన్ షిప్ కోసమే మల్టీస్టారర్ చేస్తాను. చిరంజీవి లాంటి వ్యక్తి అడిగితే నటించకుండా ఉండలేను. సల్మాన్ లాంటి స్టార్ అడిగితే కాదనలేను. కేవలం అలాంటి రిలేషన్స్ కోసమే నేను మల్టీస్టారర్స్ చేస్తాను. డబ్బు నాకు సమస్య కాదు. వాళ్ల సినిమాల్లో మంచి పాత్ర ఉంటే, నేను సూట్ అవుతానని నమ్మకంతోనే కదా అడుగుతారు. అలాంటప్పుడు నటించాల్సిందే.”
ఇన్ని చెప్పిన సుదీప్, తన మాతృ పరిశ్రమ శాండిల్ వుడ్ లో మాత్రం మల్టీస్టారర్స్ చేయనని తెగేసి చెప్పేశాడు. కన్నడ చిత్రసీమలో తనకంటూ ఓ ఇమేజ్ ఉందని, కాబట్టి అక్కడ తను మల్టీస్టారర్ మూవీస్ చేయనని అన్నాడు.