శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు సుధాకర్ కోమాకుల. ఇటీవల చిరు పుట్టినరోజు సందర్భంగా సుధాకర్ కోమకుల, తన భార్య హారిక తో కలసి ఇందువదన కుందరదన అనే పాటకి చిరంజీవిల డ్యాన్సులు చేస్తూ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో పై మెగాస్టార్ కూడా ఓ వీడియోను రిలీజ్ చేశారు. అయితే అప్పటికీ సుధాకర్ కోమాకుల అమెరికాలో ఉన్నారు.
అయితే తాజాగా సుధాకర్ మెగాస్టార్ ని కలిశారు. మెగాస్టార్ చిరంజీవి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి.. పాటను వైరల్ చేసినందుకు తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. భవిష్యత్తులో మీరు చేసే ప్రయత్నాలు అన్నీ సక్సెస్ అవ్వాలని ఆశీర్వదిస్తూ తన సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని దీవించారు చిరు.