సుధీర్ బాబు హీరోగా, హర్షవర్ధన్ దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న సినిమా ‘మామా మశ్చీంద్ర’. ఇందులో 3 విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తున్నాడు సుధీర్ బాబు.
ఇప్పటికే లావుగా ఉన్న దుర్గ క్యారెక్టర్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. తాజాగా పరశురామ్ అనే క్యారెక్టర్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ లుక్ కూడా సర్ ప్రైజ్ చేస్తోంది. చేతిలో తుపాకీ పట్టుకొని ఓల్డేజ్ గ్యాంగ్‌స్టర్ లా కనిపిస్తున్నాడు సుధీర్ బాబు. ఆయన డ్రెస్సింగ్, సిట్టింగ్ స్టైల్, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఆకట్టుకున్నాయి.
డీజే గా థర్డ్ లుక్ ఈ నెల 7న విడుదల చేయబోతున్నారు.తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్ పై సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు.
వినూత్నమైన కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. వాళ్లు ఎవరు, హీరోయిన్ ఎవరనే విషయాన్ని సస్పెన్స్ లో పెట్టారు. చైతన్ భరధ్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.