ఫిట్ నెస్ కు ప్రాధాన్యమిచ్చే యాక్టర్స్ లో సుధీర్ బాబు ఒకడు. ఆరడుగుల హైట్ తో అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తూంటాడు సుధీర్‌బాబు. వైవిధ్యంగా ఉండే సినిమాలు చేయడానికి సుధీర్ ఎప్పుడూ ముందుంటాడు. అయితే ఇప్పటివరకూ సుధీర్ బాబుకి ఒక మంచి బ్రేక్ కూడా పడలేదు. తాజాగా సుధీర్ ‘మామా మశ్చీంద్ర’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
లేటెస్ట్ గా ఈ మూవీ యూనిట్ అఫియల్ గా రిలీజ్ చేసింది. ఇందులో సుధీర్ బాబు లడ్డూ బాబులా తయారయ్యాడు. టైటిల్ పోస్టర్ నుంచే ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇటీవలే ఈ సినిమా నుండి లీకైన వీడియో నెట్టింట సంచలనం సృష్టించింది. ఒక్కసారిగా సుధీర్ బాబు లావుగా కనిపించేసరికి అందరూ షాక్ అయ్యారు. నిజమేనా సుధీర్ బాబేనా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో సుధీర్ మూడు గెటప్స్ లో కనిపించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. కాగా అందులో మొదటి గెటప్ కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయింది. దుర్గ పాత్రలో బొద్దుగా ఉన్న సుధీర్ బాబు లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పోస్టర్ తోనే సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి.
‘అమృతం’ సీరియల్ తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న హర్షవర్థన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Bet you didn’t see this coming 😉 Meet Durga! #MaamaMascheendra@HARSHAzoomout @chaitanmusic @pgvinda #SunielNarang @puskurrammohan @SVCLLP #SrishtiCelluloids pic.twitter.com/IWhVydn4ie
— Sudheer Babu (@isudheerbabu) March 1, 2023