ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు ఓ సినిమా చెయ్యటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. అయితే ఈ సినిమాతో హిట్ కొట్టటం కోసం సుధీర్ బాబు, మోహన్ కృష్ణ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారట. కాగా ఈ రోజు ఈ చిత్రం కు సంబంధించి పూజా కార్యక్రమం జరిగింది. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి నటిస్తోంది.
గతంలో సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సమ్మోహనం, వి సినిమాలలో ప్రేక్షకూల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా సుధీర్ బాబుకు మంచి పేరు తీసుకొచ్చాయి.