సుడిగాలి సుధీర్ బుల్లితెరపై చేసే రచ్చ అంత ఇంత కాదు. ప్రస్తుతం బుల్లితెరపై తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తూ బుల్లితెర హీరోగా వెలుగొందుతున్నాడు. మల్టీ టాలెంటెడ్ ఆయిన సుధీర్ తన డ్యాన్స్, సాంగ్స్, మ్యాజిక్ , హాస్య చతురతతో ఆడియన్స్ కు వినోదాన్ని పంచుతుంటాడు. సుధీర్ ఫెర్ఫామెన్స్ కు మెచ్చి ఆయనకు హీరోగా చేసే అవకాశాలు కూడా వచ్చాయి. సాఫ్ట్ వేర్ సుధీర్ తో అతను హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం త్రీ మంకీస్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ సందర్బంగా సుధీర్ ఫ్యాన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఫ్యాన్స్ అని చెప్పాడు. తాను హీరోగా నటించిన సాఫ్ట్ వేర్ సుధీర్ మంచి వసూళ్లను రాబట్టిందని.. దానికి కారణం ఫ్యాన్స్ అని తెలిపాడు. వరుసగా హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఇప్పుడే హీరో ట్యాగ్ వద్దని సూచించాడు సుధీర్.
అనిల్ కుమార్ దర్శకత్వంలో గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రలో వస్తోన్న త్రీ మంకీస్ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రాన్ని నగేష్ నిర్మిస్తున్నాడు. సాఫ్ట్ వేర్ సుధీర్ నిరాశపరిచిన ఈ సినిమా అయిన హిట్ కొడుతుందని సుధీర్ భావిస్తున్నాడు.