సుడిగాలి సుధీర్, రష్మీలకు బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరు జబర్దస్త్, ఢీ జోడీలో చేసే రచ్చ అంత ఇంత కాదు. వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతుందనే పుకార్లు షికార్లు చేస్తుంటాయి. జబర్దస్త్ అభిమానులు కూడా వీరిద్దరు ఒకటైతే చూడాలని ఉత్సాహ పడుతుంటారు. వీరిద్దరిని అభిమానులు అన్న , వదినగా వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంటారు. ఎప్పటికప్పడు వీరిద్దరు తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పిన కూడా అభిమానులు మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు.కాగా సుధీర్, రష్మీల మధ్య మనస్పర్దాలు వచ్చాయని ప్రచారం జరుగుతున్న సమయంలో… సుధీర్ మరో యాంకర్ తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు ఫిలిం వర్గాల్లో చర్చ నడుస్తోంది.
సుధీర్ పోవేపోరాలో తనతోపాటు యాంకర్ గా చేస్తోన్న విష్ణు ప్రియతో ప్రేమాయణం నడిపిస్తున్నట్టు కొత్తగా ప్రచారం జరుగుతోంది. రష్మీతో వచ్చిన మనస్పర్థలు కారణంగానే విష్ణు ప్రియతో సుధీర్ ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. అయితే ఈ వార్తలపై సుధీర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్మీ స్థానంలో మరో వ్యక్తిని ఊహించుకోలేమంటూ సుధీర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పటికైనా సుధీర్ రమ్మీలు పెళ్లి పీటలెక్కకపోరా అని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. మరికొంతమంది మాత్రం సుధీర్ విషయాల్లో ఇలాంటి ప్రచారాలు కామన్ అంటూ కొట్టిపారేస్తున్నారు.