ఇటీవల శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు. ప్రస్తుతం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా చేస్తున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
అయితే తాజాగా మరో సినిమాని అనౌన్స్ చేశాడు సుధీర్ బాబు. భారీ యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు మహేష్ సూరపనేని దర్శకత్వం వహించబోతున్నారు.
భవ్య క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ఇది సుదీర్ బాబు కెరీర్ లో 16వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ అనౌన్స్మెంట్ తో పాటు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.
మెషిన్ గన్స్ చూపిస్తూ ఇది ఒక యాక్షన్ మూవీ గా చెప్పకనే చెప్పేశారు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.