కర్నూల్ జిల్లాలో జరిగిన ప్రీతి సుగాలి హత్యాచారం కేసు దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత మళ్లీ తెరపైకి వచ్చింది. పేదోడికో న్యాయం పెద్దోడికో న్యాయమా అంటూ ప్రీతి సుగాలి తల్లితండ్రులు న్యాయం కోసం 2 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు.
ప్రభుత్వ పెద్దల అండతో… రెచ్చిపోతున్న మానవ మృగాలు కేసును పోలీసుల అండతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ప్రీతి తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. 2017లో కర్నూల్‌లోని కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్‌లో అత్యంత పాశవికంగా గిరిజన బాలికను హత్యాచారం చేశారని ఆరోపణలు వచ్చాయి. తర్వాత కలెక్టర్ కమిటీ కూడా రేప్ అండ్ మర్డర్ జరిగిందని నిర్ధారించాయి. ఇలా మూడు కమిటీలతో ప్రభుత్వ పెద్దలు కాలయాపన చేశారు. ఇంతవరకు న్యాయం జరగలేదు. పోస్ట్‌మార్టం నివేదికలోనూ హత్యాచారం జరిగిందని స్పష్టంగా వచ్చింది.
పోలీస్ ఆఫీసర్ వినోద్ కుమార్ కట్టమంచి రామలింగారెడ్డి ఆయన కుమారులకు తొత్తుగా మారి.. వాస్తవాలను తొక్కిపెట్టి, చార్జీషీటు దాఖలు చేశారని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో కట్టమంచి రామలింగారెడ్డి కుమారుల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు.
దిక్కుతోచని తల్లితండ్రులు తొలివెలుగును ఆశ్రయించారు. ఇంకా ఎలాంటి సంచలన విషయాలు చెప్పారో… ఎన్‌కౌంటర్ విత్ రఘు షోలో చూడండి.