సెలబ్రిటీల పిల్లలు అంటే ఎవరికైనా ఆసక్తిగానే ఉంటోంది. అందులో బీ టౌన్ కిడ్స్ అంటే మరింత ఆసక్తిగా ఉంటుంది. వారిలో బాలీవుడ్ బాద్ షా పిల్లలు ఆర్యన్ ఖాన్ , సుహనా ఖాన్ లు కూడా ఉంటారు. వారిద్దరూ సినిమాల్లోకి ఇంకా వారి ఎంట్రీ ఇవ్వక పోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా విపరీతంగా అభిమానులు ఉన్నారు.
సుహనా ఖాన్ త్వరలోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఎప్పటి నుంచో కథనాలు వినిపిస్తున్నాయి. కానీ ఈ అమ్మడికి ఇప్పటికే విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ కూడా నెట్టింట్లో ఎప్పటికప్పుడు తన చిత్రాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా సుహనా ధరించిన తెల్లటి ట్రాక్ ప్యాంటు ధరించి ఎయిర్ పోర్టులో దర్శనం ఇచ్చింది. సుహనా ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పటికప్పుడూ ట్రెండ్ ఫాలో అవుతూంటుంది. అలెగ్జాండర్ వాంగ్ డెనిమ్ ట్రాక్ ప్యాంటును ధరించి ఆమె అభిమానులను అలరిస్తోంది.
దాని మీద తెల్లటి స్పోర్ట్స్ బ్రాతో స్టైల్ చేసింది. 22 ఏళ్ల సుహనా లూయిస్ విట్టన్ యొక్క కజిన్ పీఎం హ్యాండ్‌బ్యాగ్‌తో తన స్టైల్‌ను సీల్ చేసింది, ఆమె బాగెట్ బ్యాగ్‌గా ధరించింది.