విజయ్ శంకర్, అషూ రెడ్డి, సుహాసిని మణిరత్నం, భానుచందర్ ప్రధాన పాత్రలలో జి. సూర్యతేజ దర్శకత్వం తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఫోకస్. మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన కథ-కథనాలతో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే విధంగా ఈ మూవీ తెరకెక్కుతోంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, వేలంటైన్స్‌డే సందర్భంగా రిలీజైన పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫోకస్ మూవీ నుండి సీనియర్ నటి సుహాసిని మణిరత్నం స్పెషల్ లుక్ ను స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ రివీల్ చేశారు. ఈ సందర్భంగా…. విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమా టీజర్ చూశాను. చాలా బాగుంది. ఇంకా మంచి పాత్రలు చాలా ఉన్నాయి. అందరూ ఈ సినిమాని చూసి ఎంకరేజ్ చేయండి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే చిత్ర దర్శకుడు జి. సూర్యతేజ మాట్లాడుతూ ఫోకస్ సినిమాలోని సుహాసిని గారి లుక్ ను ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథలను అందించిన విజయేంద్రప్రసాద్ గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది.
భాను చందర్, షియాజీ షిండే, జీవా, సూర్య భగవాన్ ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. మార్చిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.