రాజధాని విషయంలో రైతులకు అండగా కేంద్రం జోక్యం చేసుకుంటుందని తాను భావిస్తున్నట్లు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు. అవసరమైతే ఈ విషయంలో తాను వ్యక్తిగత పోరాటం చేస్తానని అన్నారు. అమరావతి రాజధాని తరలింపుపై కేంద్రం అన్నింటిని పరిశీలిస్తుందని చెప్పుకొచ్చారు. ఎంపీగా ఉండి రాజధానిని కాపాడుకోపోతే ఎం ప్రయోజనమని వ్యాఖ్యానించారు. విజయవాడలో సుజనా చౌదరి మాట్లాడుతూ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందనే నమ్మకం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేస్తున్న రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. జగన్ సర్కారు తీరును ఎండగడుతూ ప్రజలంతా స్వచ్ఛందంగా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు సుజనా చౌదరి.