సెంటు భూమి ఉందని ప్రూవ్ చేస్తే ఆస్తి మొత్తం రాసిచ్చేస్తానన్న సుజనా చౌదరి
విజయవాడ : ‘అమరావతి పరిధిలో ఉన్న 29 గ్రామాలలో నా పేరు మీద కానీ, నా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ.. ఒక్క సెంటు భూమి ఉన్నా నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తను’ అని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సవాల్ విసిరారు. అవినీతి జరిగి వుంటే నిరూపించాలని ఆయన వైసీపీ నేతలను ఉద్దేశించి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి సుజనా రాజధానిలో పర్యటించారు. అమరావతి సమస్యపై రైతులతో మాట్లాడారు. ‘అమరావతిని ఘోస్ట్ సిటీగా మార్చారని ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజధాని ఘోరాతి ఘోరంగా ఉందని దుయ్యబట్టారు.