ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న సుఖేశ్ చంద్రశేఖర్ ఓ బాలీవుడ్ నటిపై పరువు నష్టం దావా వేశాడు. ఆమె చేసిన ఆరోపణలతో తన పరువు పోయిందని ఆయన అన్నారు. ఈ మేరకు నటి చాహత్ కన్నాపై సుఖేశ్ రూ. 100కోట్లకు పరువు నష్టం దావా వేశాడు.
చాహత్ ఖన్నా తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అన్నాడు. దీంతో తాను తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నాన్నాడు. అందుకే ఆమెకు లీగల్ నోటీసులు పంపానన్నారు. వారం రోజుల్లో క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో లీగల్ గా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తందని నోటీసుల్లో ఆమెను హెచ్చరించాడు.
చాలా హిందీ సీరియల్స్‌లో చాహత్ ఖన్నా నటించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… జాక్వెలిన్ తరహాలోనే తనను కూడా మోసం చేసేందుకు సుఖేశ్ ప్రయత్నించాడని ఆమె అన్నారు. తిహార్ జైలుకు బలవంతంగా రప్పించుకుని పెండ్లి చేసుకుంటాన్నాడని ఆమె పేర్కొంది.
ఢిల్లీలో ఈవెంట్ పేరు చెప్పి పింకీ ఇరానీ అనే మహిళ తనను తిహార్ జైలుకు తీసుకెళ్లిందని ఆమె చెప్పింది. అక్కడ జైలులో సుఖేశ్ చంద్రశేఖర్ తనను కలిశాడని ఆమె వెల్లడించింది. ఓ మీడియా ఛానల్‌కు యజమానినని, దివంగత మాజీ సీఎం జయలలిలత మేనల్లుడినని సుఖేశ్ పరిచయం చేసుకున్నాడని తెలిపింది.
ఈవీఎం ట్యాంపరింగ్ కేసులో అరెస్టు అయ్యానని సుఖేశ్ చెప్పాడన్నారు. తనను అక్కడికి ఎందుకు పిలిచావని అడిగితే బడే అచ్చే లగ్తే హై సీరియల్‌లో తన నటన చూసి ఫిదా అయ్యానని సుఖేశ్ అన్నాడన్నారు. మోకాలిపై కూర్చొని పెళ్లి చేసుకుంటానని తనను ప్రపోజ్ చేశాడన్నారు.
తనకు పెళ్లయ్యిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని సుఖేశ్ తో చెప్పానన్నారు. అక్కడి నుంచి వచ్చాక తీహార్ జైలుకు వెళ్లిన వీడియోలతో తనను బ్లాక్ మెయిల్ చేశారన్నారు. దీంతో వారికి రూ. 10లక్షలు ఇచ్చి తప్పించుకున్నానన్నారు. కానీ ఈ విషయంతో తన భర్తకు తెలిసి తనను విడిచిపెట్టాడన్నారు. ఈ వ్యాఖ్యలపై సుఖేశ్ పరువు నష్టం దావా వేశారు.