బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వివాదంల్లో చిక్కుకుంది. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో రహస్యాలు బయటపడ్డాయి. సుకేశ్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ వ్యవహారం బైటకు పొక్కడంతో ఆమె చుట్టు ఉచ్చు బిగుసుకుంది. సుకేశ్ తో ఆమె అత్యంత సన్నిహితంగా ఉన్నఫోటోలు బైటకు వచ్చాయి.
సుకేశ్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసు వెలుగు చూసినప్పటి నుంచీ..బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు మీడియాలో మార్మోగుతూనే ఉంది. కానీ ఎప్పుడూ ఆమె నోరువిప్పలేదు. అయితే తాజాగా జాక్వెలిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కోర్టుకు సమర్సించిన వాగ్మూలంలో కీలకవిషయాలు వెల్లడించింది.
సుకేశ్ తన కెరీర్ నాశనం చేసాడని, తన భావోద్వేగాలతో అతడు ఆడుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. సుకేశ్ ఓ మోసగాడని..అతని తప్పుల్ని తాను గుర్తించలేకపోయానని వాపోయింది. తనని నయవంచనకు గురి చేసి, తప్పుదారి పట్టించాడని పేర్కొంది.
ఈ కేసులో తనపై తప్పుడు ఆలోపణలు చేస్తున్నారని తెలిపింది. పింకీ ఇరానీ అనే మహిళ సుకేశ్ ని ఒక ప్రభుత్వ అధికారిగా తనని పరిచయం చేసిందని జాక్వెలిన్ చెప్పింది. మొదట్లో తాను పట్టించుకోలేదని..
అయితే సుకేశ్ హోమ్ మినిస్ట్రీకి చెందిన ఒక ముఖ్యమైన అధికారి అని తన మేకప్ ఆర్టిస్ట్ ని పింకీ కన్విన్స్ చేసిందని పేర్కొంది. సుకేశ్ తనని తాను సన్ టీవీ ఓనర్ గా పరిచయం చేసుకున్నాడని, జయలలిత తనకు ఆంటీ అవుదంని చెప్పాడని తెలిపింది.
తనకు పెద్దఫ్యాన్ అని సుఖేశ్ పేర్కొన్నాడని, సన్ టీవీ ఓనర్ గా తనతో దక్షిణాది సినిమాలు చేస్తానని మాటిచ్చాడని, తాము ఎన్నో ప్రాజెక్టులు చేస్తున్నామని నమ్మబలికాడంది.
జైలులో ఉండి కూడా సుకేశ్ తనతో రోజూ మూడు సార్లు ఆడియో లేదా వీడియో కాల్స్ చేసేవాడని జాక్వెలిన్ చెప్పుకొచ్చింది. రాత్రి పడుకునే ముందు కచ్చితంగా ఫోన్ చేసేవాడంది. కానీ ఏనాడూ తాను జైల్లో ఉన్న విషయాన్ని అతడు చెప్పలేదని చెప్పింది.
అతడు సోఫాలో కూర్చొని మాట్లాడటం వల్ల జైల్లో ఉన్నాడన్న విషయం మీద తనకు ఏ అనుమానం రాలేదని తెలిపింది. చివరిసారిగా సుకేశ్ తనతో ఆగస్టు 8వ తేదీన ఫోన్ లో మాట్లాడాడని.
ఆతర్వాతి నుంచి మళ్ళీ కాంటాక్ట్ చేయలేదని చెప్పుకొచ్చింది. సుకేశ్ బ్యాక్ గ్రౌండ్ మొత్తం పింకీకి తెలుసని, అయినా ఏనాడూ తనకు చెప్పలేదని జాక్వెలిన్ వాపోయింది. తనని మోసం చెయ్యాలనే ఉద్యేశంతో సుకేశ్ తో పింకీ పరిచయం చేసిందని బాంబ్ పేల్చింది.
సుకేశ్ తనని ఫూల్ చేసాడని. అతడి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ తెలిసిన తర్వాత అతని అసలు పేరు సుకేశ్ అని తనకు తెలిసిందని చెప్పింది. తాను కేరళకి వెళ్ళాలని అనుకున్నప్పుడు సుకేశ్ తన ప్రైవేట్ జెట్ వాడుకోమని చెప్పాడని,
హెలికాప్టర్ రైడ్ కూడా ఆర్గనైజ్ జెట్ లో తాను రెండు సార్లు ప్రయాణించానని జాక్వెలిన్ చెప్పుకొచ్చింది. కాగా రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఇటీవలే ఆమెకు మధ్యంతర బెయిలు మంజూరు అయ్యింది.