ఎప్పుడైతే లైగర్ సినిమా డిజాస్టర్ అయిందో, ఆ వెంటనే విజయ్ దేవరకొండ నుంచి చాలా సినిమాలు వెనక్కి తగ్గాయి. అయితే అలా వెనక్కి తగ్గిన ప్రాజెక్టులన్నీ మళ్లీ మరో రూపంలో సెట్ అవ్వడం మొదలయ్యాయి.
లైగర్ సెట్స్ పై ఉన్నప్పుడే పూరి-దేవరకొండ కాంబోలో జనగణమన ప్రాజెక్టు లాక్ అయింది. గ్రాండ్ గా లాంఛ్ కూడా అయింది. లైగర్ ఫ్లాప్ తర్వాత ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే విజయ్ దేవరకొండతో మాత్రం అదే అడ్వాన్స్ తో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సినిమా లాక్ అయింది.
అదే విధంగా ఆగిపోయిందనుకున్న మరో సినిమా కూడా ఇప్పుడు తెరపైకొచ్చింది. లెక్కప్రకారం సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయాలి. లైగర్ ఫ్లాప్ తర్వాత ఆ సినిమా ఆగిపోయిందన్నారు. కానీ ఇప్పుడీ సినిమా మళ్లీ ఆన్ అయింది.
విజయ్ తో తన సినిమా ఆగిపోలేదని ప్రకటించాడు దర్శకుడు సుకుమార్. విజయ్ దేవరకొండతో రాబోయే రోజుల్లో కచ్చితంగా సినిమా చేస్తానంటున్నాడు ఈ క్రియేటివ్ డైరక్టర్. అలా అగిపోయాయనుకున్న సినిమాలు, మరో రూపంలో తిరిగి విజయ్ దేవరకొండ దగ్గరకే వస్తున్నాయి.