ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పా ది రూల్‌పై అందరి దృష్టి ఉంది. దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ సెన్సేషన్ సృష్టించిన పుష్ప ది రైజ్‌కి రెండో పార్టు గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇక ఓటిటి లో ప్రసారమైన తర్వాత కూడా పుష్ప ది రైజ్ చిత్రం హిందీ వెర్షన్ థియేటర్లలో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
ఇక ఇప్పుడు పుష్ప, భన్వర్ సింగ్ షెకావత్ మధ్య వివాదం ఎటువైపు దారి తీస్తుందో తెలుసుకోవడానికి సినీ ప్రేక్షకులు పుష్ప ది రూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే సుకుమార్ రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప మొదటి పార్టు క్రేజ్ తగ్గకముందే పార్టు2 షూటింగ్‌ను కంప్లీట్ చేసి వీలైనంత త్వరగా సినిమాను విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నాడట.
అల్లు అర్జున్ మార్చి రెండో వారం నుంచి పుష్పా ది రైజ్ సినిమాని మళ్లీ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ మారేడుమిల్లి ఫారెస్ట్‌లో లొకేషన్లు వెతుకుతున్నాడట. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.