ఉప్పెన చిన్న సినిమానే అయినా… టాలీవుడ్ వర్గాల్లో మంచి బజ్ తెచ్చుకుంది. ఈ సినిమా ద్వారానే హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్-క్రితి శెట్టితో పాటు డైరెక్టర్ బుచ్చిబాబు అరంగ్రేటం చేయనున్నారు. డైరెక్టర్ సుకుమార్ దగ్గర చిట్టిబాబు శిష్యరికం చేశారు.
ఫిబ్రవరి 12న సినిమా రిలీజ్ డేట్ లాక్ అయ్యింది. దింతో ఇప్పటికే సినిమా చూసిన సుకుమార్ కొన్ని రీషూట్ చేయించారు. ఆ తర్వాతే మెగాస్టార్ చిరంజీవి సినిమా చూసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే సినిమాను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేందుకు సుక్కు ఫైనల్ టచ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీక్ ఎండ్ కి ఫైనల్ కాపీ రెడి చేయనున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సినిమా తెరకెక్కుతుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.